ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా మారిన రాజకీయ క్రీడ..

ఢిల్లీ మొదలు గల్లీ దాకా.. మైనార్టీ రిజర్వేషన్స్‌ ముచ్చట పొలిటికల్‌గా పొగరేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం.. ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలకు తగ్గించి.. మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ మొదలు.. తాజాగా అమిత్‌ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి.

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా మారిన రాజకీయ క్రీడ..
Bjp Congress
Follow us

|

Updated on: Apr 25, 2024 | 7:58 PM

ఢిల్లీ మొదలు గల్లీ దాకా.. మైనార్టీ రిజర్వేషన్స్‌ ముచ్చట పొలిటికల్‌గా పొగరేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం.. ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలకు తగ్గించి.. మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ మొదలు.. తాజాగా అమిత్‌ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాలను ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీనేతల ముచ్చట.. మరింత అగ్గిరాజేసింది. వరుసగా బీజేపీ కీలకనేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా, ఎపీ ఎన్నికల ప్రచారసభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో, తాము ఆల్‌టైమ్‌ సెక్యులర్‌ అని చెప్పుకొంటున్న వైసీపీ.. ఈ అంశంలో కూటమిని టార్గెట్‌చేస్తోంది.

ఈ అంశంలో.. మోదీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతోన్న కాంగ్రెస్‌.. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతోంది. మోదీది పదేండ్ల మోసం వందేళ్ల విధ్వంసం అంటూ.. బీజేపీ నయవంచన పేరిట హైదరాబాద్‌లో చార్జిషీట్‌ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌. అదే బీజేపీ విధానమనీ.. దానికోసమే 400 సీట్లు కావాలని అంటోందనీ ఆరోపించారు. రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండమన్నారు రేవంత్‌. పరిస్థితి చూస్తుంటే మైనార్టీ రిజర్వేషన్ల అంశం.. ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. మరి, రిజర్వేషన్‌ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్‌ ఫైట్‌లో ఎవరి పైచేయి సాధిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles