జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు..

|

Sep 04, 2020 | 7:24 PM

ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ఎగువున ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా...ప్రస్థుత నీటి సామర్థ్యం..

జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు..
Follow us on

జూరాల నుంచి పరుగు పరుగున కృష్ణమ్మ శ్రీశైలంకు చేరుతోంది. శ్రీశైల మల్లన్న పాదాల చెంతకు చేరుతున్న కృష్ణమ్మ జలాలతో శ్రీశైలంకు జలకళ మరింత సంతరించుకుంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ఎగువున ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా…ప్రస్థుత నీటి సామర్థ్యం 9.62 టీఎంసీలకు చేరింది. దీంతో అధికారులు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువున ఉన్న శ్రీశైలానికి వదిలేస్తున్నారు.

దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో జలకళ ఉట్టిపడుతోంది. జూరాల నుంచి వరద ఉద్ధృతి కారణంగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరింది. ప్రస్థుతం ఇన్‌ఫ్లో 72 వేల 648 క్యూసెక్కులు ఉండగా…ఔట్‌ఫ్లో 19 వేల 305 క్యూసెక్కులుగా ఉంది.