వానొచ్చే వరదొచ్చే.. మహబూబ్‌నగర్ జిల్లాలో జోరు వానలు

|

Sep 19, 2020 | 12:13 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో పడుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

వానొచ్చే వరదొచ్చే.. మహబూబ్‌నగర్ జిల్లాలో జోరు వానలు
Follow us on

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో పడుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న కారణంగా పక్కన తాత్కాలికంగా మట్టిరోడ్డు వేశారు. దాంతో రాయచూరు నుంచి గద్వాల వైపు వస్తున్న ఓ లారీ ఆ మట్టిలో కూరుకుపోయి పక్కకు ఒరిగిపోయింది. వరద కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కేటి దొడ్డి మండలం నందిన్నెవాగుపై బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న కారణంగా మట్టితో తాత్కాలికంగా రోడ్డు వేయడంతో లారీ ఇరుక్కుపోయింది. అందులో ఉన్న డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు.