Health news: రోజు అవిసె గింజలను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలట.. అవేంటో తెలుసుకుందామా..

|

Dec 25, 2020 | 9:20 PM

ప్రస్తుత పరిస్థితులలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. అందుకు తగినట్టుగా మనం ఎన్నో రకాల పోషక పదార్థాలను తీసుకుంటాం.

Health news: రోజు అవిసె గింజలను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలట.. అవేంటో తెలుసుకుందామా..
Follow us on

ప్రస్తుత పరిస్థితులలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. అందుకు తగినట్టుగా మనం ఎన్నో రకాల పోషక పదార్థాలను తీసుకుంటాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవిసె గింజలు. వీటి గురించి చాలా మందికి తెలియదు. కానీ విటిని తినడం వల్ల శరీరానికి కలిగే లాభాల గురించి తెలియక వాటిని తినేందుకు అందురు ఇష్టపడతారు. వాటి లాభాలేంటో తెలుసుకుందాం.

అవిసె గింజ‌ల్లో వృక్ష సంబంధ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏఎల్ఏ ఉంటుందట. ఈ ఫ్యాటీ యాసిడ్లు గుండెను సంర‌క్షిస్తాయి. దీని వ‌ల్ల గుండె నొప్పులు వచ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో లిగ్నన్స్ అనే పోష‌కాలు ఉంటాయని.. అవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేస్తాయి. అలాగే ఒయిస్ట్రోజెన్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల బ్రెస్ట్‌, ప్రోస్టేట్ క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిని రోజు తినడం వలన జీర్ణ స‌మ‌స్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ శ‌రీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. నాన్ వెజ్ తిన‌ని వారికి వీటిని తినడం వల్ల వృక్ష సంబంధ ప్రోటీన్లు అందుతాయి. దీంతో శ‌క్తి ల‌భిస్తుంది. క‌ణ‌జాలం నిర్మాణం అవుతుంది. మరీ ఇంకెందు ఆలస్యం. ఇకనుంచి రోజు ఈ అవిసె గింజలను తినండి.