విషాదం : బావిలో పడిన దూడను కాపాడేందుకు వెళ్లి ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ గోండాలో విషాదం చోటుచేసుకుంది.  విషవాయువు కారణంగా ఐదుగురు ప్రాణాలు విడిచారు.

విషాదం : బావిలో పడిన దూడను కాపాడేందుకు వెళ్లి ఐదుగురు మృతి

Updated on: Sep 08, 2020 | 5:48 PM

ఉత్తర్​ప్రదేశ్​ గోండాలో విషాదం చోటుచేసుకుంది.  విషవాయువు కారణంగా ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఓ లేగ దూడ బావిలో పడటంతో రక్షించేందుకు అందులోకి దిగిన యువకులు విషవాయువు పీల్చడంతో చనిపోయారు. వీరంతా  ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో  తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి.

మొదటిగా నలుగురు యువకులు బావిలోకి దిగి దూడను కాపాడే ప్రయత్నం చేశారు. లోపల విషవాయువు ప్రభావంతో ఈత కొట్టలేక నీళ్లలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు నీళ్లలోకి దూకిన వ్యక్తి కూడా తనువు చాలించాడు.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

 

Loading...
Unable to load recommendations.
Follow Us