అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ము బేస్ క్యాంపు నుంచి తెల్లవారుజామునే అమర్ నాథ్ యాత్రికుల తొలిబృందం బయలు దేరింది. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారుడు కేకే శర్మ జెండా ఊపి ప్రారంభించారు. భంభం భోలే నినాదాలతో భక్తులు ఆ పరమశివుడిని నామాన్ని స్మరిస్తూ.. యాత్ర ప్రారంభమైంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగ్ర హెచ్చిరకల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తాము ఎటువంటి ప్రమాదానికైనా భయపడేది లేదన్నారు భక్తులు. కాగా యాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా సైన్యం పహారా కొనసాగుతోంది. 46 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర్‌నాథుడిని దర్శించుకున్నారు. అనంతరం రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
Jammu: First batch of Amarnath Yatra flagged off from Jammu base camp by KK Sharma, Advisor to the Governor Satya Pal Malik, amidst tight security. #JammuAndKashmir pic.twitter.com/aMO8dMp60x
— ANI (@ANI) June 29, 2019