శేషాచలం అడవుల్లో భారీగా వ్యాపించిన మంటలు

| Edited By:

Mar 30, 2019 | 4:41 PM

తిరుమల : శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 10కిలోమీటర్ల దూరంలో ధర్మగిరి వేదపాఠశాల సమీపంలోని గాడికొన అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి బలంగా వీస్తోంది. దీంతో మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. లోయ ప్రాంతం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోతున్నారు. గడిచిన నెలరోజులుగా తరచూ శేషాచలంలో మంటలు అంటుకుంటున్నాయి. ఎండ తీవ్రత ఒక కారణం అయితే.. టాస్క్ ఫోర్స్ దృష్టి మళ్లీంచేందుకు ఎర్రచందనం […]

శేషాచలం అడవుల్లో భారీగా వ్యాపించిన మంటలు
Follow us on

తిరుమల : శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 10కిలోమీటర్ల దూరంలో ధర్మగిరి వేదపాఠశాల సమీపంలోని గాడికొన అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి బలంగా వీస్తోంది. దీంతో మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. లోయ ప్రాంతం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోతున్నారు. గడిచిన నెలరోజులుగా తరచూ శేషాచలంలో మంటలు అంటుకుంటున్నాయి. ఎండ తీవ్రత ఒక కారణం అయితే.. టాస్క్ ఫోర్స్ దృష్టి మళ్లీంచేందుకు ఎర్రచందనం స్మగ్లర్లే అడవికి నిప్పు పెడుతున్నారని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

గడిచిన రెండు రోజుల్లో సుమారు 40హెక్టార్ల మేర అడవి దగ్ధమైంది. నిన్న ఉదయం ధర్మగిరి సమీపంలో గాడికొన అటవీ ప్రాంతంలో ప్రారంభమైన మంటలు.. అంతకంతకు వ్యాపించి శ్రీవారి పాదాలు సమీపంలోని సద్ది కూడిబండ, దొంగలరేవు అటవీ ప్రాంతం వరకు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా.. అదుపులోకి రావడం లేదు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఫైరింజన్లను తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో సుమారు 200 మంది వివిధ విభాగాల సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ధర్మగిరి వేద పాఠశాలకు ఆనుకొని ఉన్న శ్రీగంధం తోటకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కాగా ఇప్పటి వరకు రిజర్వ్ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు, నెమ్మదిగా టీటీడీ పరిధిలోని అటవీ ప్రాంతానికి పాకుతున్నాయి.