బోనులో.. చిక్కింది చిరుత..!

| Edited By: Anil kumar poka

Jun 19, 2019 | 12:31 PM

గుజరాత్‌లో గతవారం రోజులుగా హల్ చల్ చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కురెల్ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు చిరుతను చాకచక్యంగా బోనులో బంధించారు. వివరాల్లోకి వెళితే గతవారం రోజులుగా గుజరాత్‌లోని నవసరి సిటీ సమీప గ్రామాల్లో చిరుత సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అర్థరాత్రి వీధుల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో […]

బోనులో.. చిక్కింది చిరుత..!
Follow us on

గుజరాత్‌లో గతవారం రోజులుగా హల్ చల్ చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కురెల్ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు చిరుతను చాకచక్యంగా బోనులో బంధించారు. వివరాల్లోకి వెళితే గతవారం రోజులుగా గుజరాత్‌లోని నవసరి సిటీ సమీప గ్రామాల్లో చిరుత సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అర్థరాత్రి వీధుల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. వారం రోజులుగా కురెల్ గ్రామ సమీపంలోనే చిరుత నక్కినట్లు సీసీ టీవీల్లో రికార్డు కావడంతో అదే ప్రాంతంలో చిరుతను బంధించేందుకు ఓ బోను ఏర్పాటు చేశారు. కురెల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో చిరుత అక్కడ బోనులో చిక్కుకుంది. వెంటనే ఆ చిరుతను ప్రత్యేక వాహనంలో జూకు తరలించారు.