Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ రంగంలో గడిచిన ఆరున్నరేళ్లలో 1.28 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడం జరిగిందని, త్వరలో మరో 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగులు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా తెలంగాణకు 14వేల పరిశ్రమలు వచ్చాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవశాలు దక్కాయన్నారు. పారిశ్రామిక ఐటీ సంస్థల ఏర్పాటుకు అనువైన సదుపాయాలు, పారదర్శక విధానాలు, శాంతి భద్రతలు ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ రంగంలో అనేక మందికి పదోన్నతి లభించడంతో కొత్త ఉద్యోగాల భర్తీకి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ఎంతో అభివృద్ధి చెందిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు.