దేశంలో ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకి 5వ స్థానం

దేశంలోని ఉత్తమమైన యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 5వ స్థానం దక్కింది. ప్రముఖ పత్రిక ఔట్‌లుక్‌ దేశంలోని బెస్ట్ యూనివర్సిటీస్ ను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 75 యూనివర్సిటీలను అత్యుత్తమ ప్రమాణాలు కలిగినవిగా గుర్తించారు.

దేశంలో ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకి 5వ స్థానం
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 14, 2020 | 3:26 PM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోని ఉత్తమమైన యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 5వ స్థానం దక్కింది. ప్రముఖ పత్రిక ఔట్‌లుక్‌ దేశంలోని బెస్ట్ యూనివర్సిటీస్ ను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 75 యూనివర్సిటీలను అత్యుత్తమ ప్రమాణాలు కలిగినవిగా గుర్తించారు. హెచ్‌సీయూ 5వ స్థానంలో ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీకి 23వ స్థానం దక్కాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇక, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి రెండో స్థానం దక్కింది. వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ(కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)కు 32వ స్థానం, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 54వ స్థానంలో కొనసాగుతున్నాయి. అకడమిక్‌, పరిశోధనా రంగాల్లో ప్రతిభ, పరిశ్రమలతో సంబంధాలు, ప్లేస్‌మెంట్‌ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిపాలన, అడ్మిషన్లు, వైవిధ్యం, అందుబాటు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చామని ఔట్‌లుక్‌ పేర్కొంది. కాగా, దేశంలోని 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఉపకులపతి అప్పారావు అన్నారు. ప్రపంచంలోని టాప్‌వర్సిటీల్లో స్థానం దక్కించుకునేలా మరింత కృషి చేస్తామని వీసీ తెలిపారు

కాగా, ఉత్తమ స్థాయిలో ఉన్న 25 సెంట్రల్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ స్థాయిలో ఉన్న 23 సాంకేతిక విద్యాలయాల ర్యాంకుల్లో హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీకి 11వ, హైదరాబాద్‌ ఐఐటీకి 14వ, అనంతపురం జేఎన్‌టీయూకు 18వ, గుంటూరులోని విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ సైన్స్‌కు 23వ స్థానం దక్కాయి.

ఇక, ఉత్తమ స్థాయిలో ఉన్న 75 పబ్లిక్‌ స్టేట్‌ వర్సిటీల్లో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీకి 5వ స్థానం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి 10వ స్థానం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 22వ స్థానం, శ్రీవేంకటేశ్వరా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు 42వ స్థానం, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 56వ స్థానం, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి 64వ స్థానం, గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి 65వ స్థానం, కడపలోని యోగి వేమన వర్సిటీకి 69వ స్థానం దక్కాయి.

అటు ఉత్తమ డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా ర్యాంకులను కేటాయించారు. ఉత్తమ 50 డీమ్డ్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లను పోలిస్తే కోనేరు లక్ష్మయ్య వర్సిటీకి 12వ, విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజిమెంట్‌కు 22వ, హైదరాబాద్‌లోని ఐసిఎ్‌ఫఏఐ ఫౌండేషన్‌కు 36వ ర్యాంకు, అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌కు 43వ ర్యాంకు లభించాయి .