సభ్యసమాజంలో తలదించుకునే ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. రానురనూ మనుషుల్లో మానవత్వ విలువలు మంట కలిసి పోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ బాలికపట్ల కాలయముడయ్యాడు. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే తండ్రితో పాటు ఒడిలో పెట్టుకొని ఆడించాల్సిన తాత కూడా ఆమెను వదలలేదు. దీంతో 15 ఏళ్ల బాలిక గర్భవతి కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని తంజావూరుకు చెందిన బాలిక తల్లి మరణిండంతో తండ్రితో కలిసి ఉంటుంది. ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి బాలికను లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కసాయికి తోడు ఆమె తాత కూడా బాలికపై ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన అత్తా వైద్యులకు చూపించింది. బాలిక గర్భం దాల్చినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బాలిక అత్త న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాత, తండ్రిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక గర్భవతి కావడంతో దీనిపై విచారించిన కోర్టు బాలిక గర్భాన్ని తొలగించేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. వైద్య పరంగా అన్ని పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం, వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రెగ్నన్సీని తొలగించాలని ఆదేశించింది. కొన్ని అసాధారణమైన పరిస్థితిలో బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి తీర్పులు ఇవ్వాల్సి వచ్చిందని న్యాయం స్థానం పేర్కొంది.