
Messi Suspension : బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడు మెస్సీపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. స్పానిష్ సూపర్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని చేతితో తీవ్రంగా గాయపరిచినందుకుగాను స్పానిష్ సాకర్ సమాఖ్య మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో గోల్ పోస్ట్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అథ్లెటిక్ బిల్బావో ఫుట్‌బాలర్ ఏసియర్ను చేతితో మెస్సీ గట్టిగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు. ఇలాంటి తప్పిదాలకు 12 మ్యాచుల వరకు నిషేధం విధించే అవకాశముంది. అయితే దానిని అంత తీవ్రంగా పరిగణించని ఫుట్ బాల్ సమాఖ్య.. మెస్సీపై తక్కువ పెనాల్టీ విధించింది. ఇక ఆ జట్టు తరఫున మెస్సీ 753 మ్యాచులు ఆడగా.. రెడ్‌కార్డు తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.