Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?

|

Jan 03, 2021 | 5:15 PM

విధి మనుషులు జీవితాలతో ఎప్పుడు..ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. కన్నీళ్లు కూడా జాలి పడేలా ఓ కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టింది విధి. కుటుంబం మొత్తాన్ని మృత్యువు...

Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

విధి మనుషులు జీవితాలతో ఎప్పుడు..ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. కన్నీళ్లు కూడా జాలి పడేలా ఓ కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టింది విధి. కుటుంబం మొత్తాన్ని మృత్యువు అదే పనిగా వెంటాండింది. విశాఖ జిల్లాలో ఈ కన్నీరు పెట్టించే దుర్ఘటన జరిగింది. తండ్రి, పెద్ద తనయుడు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోగా..చిన్న కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హుకుంపేట మండలం గరుడపల్లి గ్రామానికి చెందిన మర్రి బిచ్చు చిన్న కుమారుడు విష్ణు(30) యాక్సిడెంట్‌లో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బిచ్చు పెద్ద కుమారుడు మల్లేశ్​ కుమార్​(35) సోదరుడ్ని పాడేరు గవర్నమెంట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. అతడి పరిస్థితి పర్లేదు అని చెప్పడంతో తిరిగి బైక్‌పై ఇంటికి పయనమయ్యాడు. దారిలో మల్లేశ్​ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. పత్రిమెట్ట వద్ద జరిగిన ఈ యాక్సిడెంట్‌లో మల్లేష్ స్పాట్‌లో ప్రాణాలు విడిచాడు.   కొడుకు మరణవార్త మల్లేశ్​ తండ్రికి వెలిసింది. వెంటనే.. చింతపల్లి నుంచి ఆటోలో హడావిడిగా బయల్దేరాడు. తండ్రి బిచ్చు వస్తుండగా మరో ప్రమాదం జరిగింది. జి. మాడుగుల మండలం బంధవీధి వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిచ్చు కన్నుమూశాడు. ఓ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే… మరో కుమారుడు ప్రమాదంలో చనిపోయాడు. వారిని చూసేందుకు వెళ్తున్న తండ్రిని మృత్యువు మరో ప్రమాదం రూపంలో కాటేసింది. దీంతో వాళ్ల అంత్యక్రియలకూ డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ప్రజాప్రతినిధులు సహాయంతో అంత్యక్రియలు జరిపించారు గ్రామస్థులు.

Also Read :

Btech Ravi Arrest : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌…ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ramatheertham Live Updates: నేతల పర్యటన, కార్యకర్తల ఆందోళనలు .. రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం..