అమిత్ షా చర్చల ప్రతిపాదనకు తలొగ్గని రైతులు, ముందు షరతులు వద్దని డిమాండ్ ! ఢిల్లీలో అదే సీన్ !

| Edited By: Pardhasaradhi Peri

Nov 29, 2020 | 5:33 PM

డిసెంబరు 3 న చర్చలకు రావాలని, మీ నిరసన కార్యక్రమాన్ని కేంద్రం నిర్ణయించిన స్థలం వద్దే చేపట్టాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనను రైతులు తిరస్కరించారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేస్తున్న వీరు..

అమిత్ షా చర్చల ప్రతిపాదనకు తలొగ్గని రైతులు, ముందు షరతులు వద్దని డిమాండ్ ! ఢిల్లీలో అదే సీన్ !
Follow us on

డిసెంబరు 3 న చర్చలకు రావాలని, మీ నిరసన కార్యక్రమాన్ని కేంద్రం నిర్ణయించిన స్థలం వద్దే చేపట్టాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనను రైతులు తిరస్కరించారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేస్తున్న వీరు..ఎలాంటి ముందు షరతులనూ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. కేంద్రం అరమరికలు లేకుండా మనస్ఫూరిగా చర్చలకు రావాలని కోరారు. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన  ఓ కమిటీ.. ప్రస్తుతానికి బోర్డర్లో ధర్నా చేయాలని నిర్ణయించింది. తాము విశాలమైన రామ్ లీలా గ్రౌండ్స్ లోనే ధర్నా చేస్తామని అన్నదాతలు పట్టుబడుతున్నారు.

ఇలా ఉండగా ఢిల్లీ-హర్యానా బోర్డర్లో ఆదివారం ఉదయం కూడా రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నెరాలా ప్రాంతం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు కదిలారు. వారిని అడ్డుకునేందుకు ఖాకీలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ రైతులతో చర్చలకు సమాయత్తమవుతున్నారు.  డిసెంబరు 3 న తమతో చర్చలకు రావాలని వివిధ రైతు సంఘాలను ఆయన ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా రైతు చట్టాలను ఉపసంహరించనిదే తాము వెనక్కి వెళ్ళేది లేదని అన్నదాతలు భీష్మించుకుని కూర్చున్నారు.