ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల లీగల్ నోటీసులు, వారిలో రామ్ మాధవ్ కు కూడా , ఆందోళనను కించపరిచారని ఆరోపణ

పంజాబ్ కు చెందిన రైతులు ముగ్గురు బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు..

ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల లీగల్ నోటీసులు, వారిలో రామ్ మాధవ్ కు కూడా , ఆందోళనను కించపరిచారని ఆరోపణ
farmers protest

Edited By:

Updated on: Jan 02, 2021 | 10:17 PM

పంజాబ్ కు చెందిన రైతులు ముగ్గురు బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం  నితిన్ పటేల్, మరో నేత రామ్ మాధవ్ కు వారు వీటిని పంపారు. ఈ నేతలు తమ ఆందోళనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రామ్ మాధవ్ తన ట్విట్టర్లో తమ నిరసనను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. మరో ఇద్దరు కూడా తమ ఇంటర్వ్యూలలో ఇలాగె వ్యవహరించారని రైతులు ఆరోపించారు. ఈ నోటీసుల విషయంలో పంజాబ్ ఆప్ ఇన్-ఛార్జ్ రాఘవ్ చద్దా ఆయనలీగల్ టీమ్ వీరికి తోడ్పడుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.