సీఎం జగన్ రాజధానిపై ప్రకటనతో.. అమరావతి రైతులు ఆందోళనతో రోడ్డెక్కారు. మందడంలో పురుగుమందుల డబ్బాలతో రోడ్డుపైనే బైఠాయించి.. నిరసన వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటికే అన్నీ ఏర్పాటవుతున్న అమరావతి నుండి సెక్రటరీయేట్‌ను, హైకోర్టును తరలించడాన్ని వారు తప్పుబట్టారు. అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో.. పరిపాలన మొత్తాం అక్కడి నుంచే కొనసాగాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు కూడా అమరావతినే రాజధానిగా కావాలంటూ ఆందోళన చేస్తున్నారు.
అమరావతిలో ఏపీ రాజధాని ఏర్పాటవుతుందని.. అందుకే తమ భూములన్నీ ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని మూడు ప్రదేశాల్లో ఇవ్వడమేంటని వారు పెద్దఎత్తున నిరసనలు చేస్తోన్నారు. హైకోర్టు, సెక్రటేరియేట్ తరలిపోతే ఇక్కడి రైతులు అన్యాయం అయిపోవాలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అమరావతి సెక్రటరియేట్ వద్ద ఉద్రిక్తతగా ఉంది. రైతులందరూ.. రోడ్డుపై బైఠాయించి పురుగుమందుల డబ్బాలతో.. సెక్రటేరియేట్‌న వద్ద మోహరించారు. ఉద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డంగా బైఠాయించారు. ఎన్నికల ముందు జగన్ ఒక హామి ఇచ్చి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని..? నాడు ‘అమరావతినే ఏపీ రాజధాని’ అని చెప్పి.. ఇప్పుడు ఇలా ఎలా చేస్తారంటూ రైతులు సీఎం జగన్‌ని ప్రశ్నిస్తున్నారు.