రైతులతో ముగిసిన చర్చలు, జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయం, పలు అంశాలపై సానుకూలత

|

Dec 30, 2020 | 7:56 PM

రైతుల ఆందోళన నేపథ్యంలో రైతులు, రైతు సంఘాల నేతలతో కేంద్రం ప్రభుత్వం ఇవాళ జరిపిన చర్చలు కొంచెం సేపటిక్రితం ముగిశాయి. పలు అంశాలపై..

రైతులతో ముగిసిన చర్చలు, జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయం, పలు అంశాలపై సానుకూలత
Follow us on

రైతుల ఆందోళన నేపథ్యంలో రైతులు, రైతు సంఘాల నేతలతో కేంద్రం ప్రభుత్వం ఇవాళ జరిపిన చర్చలు కొంచెంసేపటిక్రితం ముగిశాయి. పలు అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఇక రైతులు ఆందోళనను విరమించాలని కూడా కేంద్రం కోరింది. కాగా, రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు తీసుకొచ్చేందుకు, విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వంటివాటిపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కాగా, రైతులు లేవనెత్తిన 3 చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై చట్టం తేవడం వంటి వాటిపై కేంద్రం తన విముఖతను కొనసాగించింది. మోదీ సర్కారు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై ప్రముఖంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ మరోమారు రైతులతో కేంద్రం చర్చలు జరిపింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఐదుమార్లు కేంద్రం, రైతులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.