ఈ నెల 8 న ఢిల్లీ దిగ్బంధం, దేశ వ్యాప్త బంద్ కు రైతుల పిలుపు, ఆందోళన ఉధృతికి వ్యూహం

రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న అన్నదాతలు వచ్ఛేవారం దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి దారి తీసే అన్ని రోడ్లనూ ఈ నెల 8 న (మంగళవారం) మూసివేస్తామని వారు హెచ్ఛరించారు. ఇప్పటివరకు కేంద్రంతో..

  • Umakanth Rao
  • Publish Date - 6:22 pm, Fri, 4 December 20
ఈ నెల 8 న ఢిల్లీ దిగ్బంధం, దేశ వ్యాప్త బంద్ కు రైతుల పిలుపు, ఆందోళన ఉధృతికి వ్యూహం

రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న అన్నదాతలు వచ్ఛేవారం దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి దారి తీసే అన్ని రోడ్లనూ ఈ నెల 8 న (మంగళవారం) మూసివేస్తామని వారు హెచ్ఛరించారు. ఇప్పటివరకు కేంద్రంతో రైతు సంఘాలు నిర్వహించిన చర్చల్లో..  ఈ చట్టాలను రద్దు చేస్తామని  కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని వారంటున్నారు. ‘వచ్ఛే మంగళవారం  దేశంలోని అన్ని హై వే టోల్ గేట్లనూ ఆక్రమిస్తాం..టోల్ ఫీజును ప్రభుత్వం వసూలు చేయకుండా అడ్డుకుంటాం..మా ఉద్యమంలో మరింతమంది రైతులు చేరుతారు’.. అని హరీందర్ సింగ్ లాఖోవాల్ అనే రైతు సంఘం నేత చెప్పారు. శనివారం మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు. అటు-.. ఢిల్లీలో ఇప్పటికే వేలాది అన్నదాతలు ఉండగా ఢిల్లీ శివారుతో బాటు నోయిడా, ఘజియాబాద్ వంటి చోట్ల కూడా వందలాది మంది మోహరించారు. తమ డిమాండు నెరవేరేంతవరకు వెనక్కి వెళ్ళేది లేదని వారు స్పష్టం చేశారు. వారి ఆందోళన నేపథ్యంలో అన్ని సరిహద్దులనూ పోలీసులు మూసివేశారు.

మా డిమాండును పక్కనబెట్టిన కేంద్ర మంత్రులు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, చట్టాలకు సవరణలు చేస్తామంటున్నారని…  కానీ ఈ కమిటీల వల్ల ఒరిగేది శూన్యమని రైతు సంఘాలు అంటున్నాయి. రాజస్థాన్, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు కూడా తమతో జత కలిశారని రైతు సంఘాలు అంటున్నాయి. ఆలిండియా బంద్ కు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని వారు కోరుతున్నారు. కాగా శనివారం కేంద్రంతో జరిపే చర్చల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై శుక్రవారం వారు తమలో తాము చర్చలు జరిపారు. అటు- పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రైతుల ఆందోళనకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..