డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త.. ఆర్బీఐ కొత్త రూల్స్… జనవరి 1 నుంచి అమలులోకి
డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాడానికే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా ఇకమీదట కాంటాక్ట్‌లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇకపై రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన పనిలేదని.. ఖాతదారులు లావాదేవీలను సులభంగానే పూర్తి చేయొచ్చని తెలిపింది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో ఇకమీదట కస్టమర్లు సులభంగానే లావాదేవీలు పూర్తిచేసుకోవచ్చు. అదే బాటాలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఆర్బీఐ మరో విషయాన్ని ప్రకటించింది. ఆర్టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా నగదు పంపిణి చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: