కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వ్యసాయ భూమిలో మిర్చి పంటకు నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై తుమ్మల వెంగళరావు (48) అనే కౌలు రైతు మృతి చెందాడు. ఓట్ల సాంబయ్య అనే రైతుకు చెందిన పొలాన్ని.. ఏపీ లోని కృష్ణా జిల్లా శివాపురం గ్రామానికి చెందిన తుమ్మల వెంగళరావు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.
ఆదివారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమం లో విద్యుత్ షాక్‌తో వెంగళరావు ప్రమాదానికి గురయ్యాడు. సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు గమనించి అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేయించారు. అయితే అప్పటికే రైతు అపస్మారకస్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.