ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు సెర్బియా దేశంలో అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ప్రతినిధుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఆయన్ని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెల్‌గ్రాడ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారని సమాచారం.