ఉన్నావ్ ఘటన సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

| Edited By:

Jul 31, 2019 | 1:17 PM

ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై జరిగిన రోడ్డుప్రమాదం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఆమె ప్రయాణిస్తున్నకారును ఓ లారీ ఢీకొనడంతో ఆకారులో ఉన్న బాధితురాలి లాయర్ సహా ఆమె కుటుంబసభ్యులు కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.ఇప్పటికే ఆమె చిన్నమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఈఘటనపై బాధితురాలి చిన్నాన్న రాసిన లేఖపై స్పందించిన సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ఈ లేఖను ఈనెల 12 న సీజేఐకి రాశారు. అయితే ఆలస్యంగా ఇవ్వడంపై ప్రధాన కార్యదర్శిని […]

ఉన్నావ్ ఘటన  సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
Follow us on

ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై జరిగిన రోడ్డుప్రమాదం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఆమె ప్రయాణిస్తున్నకారును ఓ లారీ ఢీకొనడంతో ఆకారులో ఉన్న బాధితురాలి లాయర్ సహా ఆమె కుటుంబసభ్యులు కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.ఇప్పటికే ఆమె చిన్నమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఈఘటనపై బాధితురాలి చిన్నాన్న రాసిన లేఖపై స్పందించిన సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ఈ లేఖను ఈనెల 12 న సీజేఐకి రాశారు. అయితే ఆలస్యంగా ఇవ్వడంపై ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. గురువారం ఈ కేసు విచారణకు రానుంది.

బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బీజేపీకీ కూడా సీరియస్ అయ్యింది. సెంగార్‌ను సస్పెండ్ చూస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆపార్టీ. మరోవైపు తమకు బెదిరింపు ఫోన్స్ కాల్స్ అందుతున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.