ఈమెయిల్ ఐడీలను బట్టబయలు చేస్తోన్న ఫేస్‌బుక్ బగ్.. ఎఫ్‌భీతో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటా బహిరంగం.

|

Dec 19, 2020 | 9:07 PM

టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌లో మరో బగ్ బయటపడింది. ఈ బగ్ వినియోగదారల ఈమెయిల్ ఐడీలను బట్టబయలు చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు గుర్తించారు. ఈ బగ్ కారణంగా ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటాలు కూడా బయటపెట్టేస్తున్నట్లు కనుగొన్నారు.

ఈమెయిల్ ఐడీలను బట్టబయలు చేస్తోన్న ఫేస్‌బుక్ బగ్.. ఎఫ్‌భీతో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటా బహిరంగం.
Follow us on

facebook bug reveals users data: టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌లో మరో బగ్ బయటపడింది. ఈ బగ్ వినియోగదారల ఈమెయిల్ ఐడీలను బట్టబయలు చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు గుర్తించారు. ఈ బగ్ కారణంగా ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటాలు కూడా బయటపెట్టేస్తున్నట్లు కనుగొన్నారు. సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్‌లను క్రియేట్ చేసేప్పుడు పుట్టిన రోజు, ఈమెయిల్ అడ్రస్ లాంటి సమాచారాన్ని అడుగుతాయి. ఈ బగ్ కారణంగా ఇలాంటి సమాచారం లీక్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ సమాచరంతో సైబర్ నేరగాళ్లు దాడులు చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక ప్రయోగాత్మక ఫీచర్ అని సమాచారం. కొన్ని బిజినెస్ అకౌంట్లకు దీని ఫీచర్ యాక్సెస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బగ్ గురించి ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ బిజినెస్ అకౌంట్ల కోసం చేసిన టెస్టులో ఓ పరిశోధకుడు ఈ సమస్యను కనుగొన్నారు. అందులో వారు చేసిన పర్సనల్ మెసేజ్ కూడా బట్టబయలు అయ్యింది. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాం. ఈ బగ్‌ను గుర్తించిన రీసెర్చర్‌కు రివార్డు కూడా ఇచ్చాం’ అని చెప్పుకొచ్చారు.