SPBalasubrahmanyam Life Saropt Now : ఎక్మో.. ఇదే ఇప్పుడు బాలుకీ లైఫ్ సరోప్ట్. చాలా రోజులుగా అస్వస్థత నుంచి కోలుకుంటున్న వ్యక్తికి షడన్‌గా గుండె, ఊపిరి తిత్తుల పని చేయని పక్షంలో అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఆపదలో ఉన్న రోగికి ప్రాణరక్షణ లాంటిది. ఈ వైద్యాన్ని 2016లో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు అందించారు. ఇప్పుడు ఎస్పీబీకి అందిస్తున్నారు.
గుండె, ఊపిరి తిత్తులు యాక్టివ్‌గా పనిచేయనప్పుడు మాత్రమే ఈ ఎక్మో యంత్రాన్ని ఉపయోగిస్తారు. పేషెంట్ శరీరంలో ఉండే గుండె, ఊపిరి తిత్తుల పనిని బయటి నుంచే ఈ యంత్రమే నిర్వహిస్తుంది. అత్యంత విషమ పరిస్థితుల్లోనే దీన్ని ఉపయోగిస్తారు. ఎస్పీ బాలుకి కూడా మొదట్లో సాధారణ పేషెంట్ మాదిరిగానే వెంటిలేటర్లపై చికిత్స అందించారు. వెంటిలేటర్‌పై రోగిని ఉంచినపుడు ఊపిరి తిత్తులు కొంతైనా పని చేస్తున్నప్పుడే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలో వెంటిలేటర్ వల్ల సరైన రిజల్ట్ రాకపోవడంతో వైద్యులు ఈ ఎక్మో యంత్రం ద్వారా ఆయనకు ప్రాణరక్షణ కల్పిస్తున్నారు.
శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపే గుండె….రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు పంపే ఊపిరితిత్తుల పనితీరు బాగుంటేనే పేషెంట్‌కి ఎక్మో యంత్రంతో పని ఉండదు. గుండె పని చేస్తూ…ఊపిరి తిత్తుల పనితీరు బాగోలేకపోతే…ఊపిరి తిత్తుల్లో చేరిన రక్తాన్ని ఎక్మో యంత్రం ద్వారా శుభ్రపరిచి గుండెకు చేరవేస్తుంది. బాలు ట్రీట్‌మెంట్ విషయంలో కూడా చెన్నై ఎంజీఎం డాక్టర్లు ఈ తరహా వైద్యాన్ని చేస్తున్నారు.