Donthi Madhava Reddy injured : మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు బోల్తా..ఆస్పత్రికి తరలింపు..తాజా పరిస్థితి ఇది

నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ లిమిట్స్ బైపాస్ వద్ద ఓ బైక్‌ను ఢికొట్టింది....

 Donthi Madhava Reddy injured : మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు బోల్తా..ఆస్పత్రికి తరలింపు..తాజా పరిస్థితి ఇది

Updated on: Jan 04, 2021 | 2:10 PM

Donthi Madhava Reddy injured : నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ లిమిట్స్ బైపాస్ వద్ద ఓ బైక్‌ను ఢికొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనం తీవ్రంగా ధ్వంసమైంది.  దొంతి మాధవ రెడ్డి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కారు డ్రైవర్‌కు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

యాక్సిడెంట్ విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానిక నాయకులు వివరాలు కనుక్కుని ప్రమాదం ఏమి లేదని చెప్పడంతో కుదుటపడ్డారు.

 

Also Read :

Sourav Ganguly health update: దాదా ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల..నేడు ఈకో కార్డియోగ్రఫీ నిర్వహించనున్న వైద్యులు

RX100 Hindi remake: ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీ రీమేక్.. ఒరిజినల్‌కు మించి రొమాన్స్ సీన్స్ ఉంటాయని మేకర్స్ హింట్