బ్రేకింగ్: 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని అరెస్టు..

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుల కారణంగా 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని.. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. చింతమనేనిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసుల్లో చింతమనేని నిందితుడిగా ఉన్నారు. అయితే తనను అరెస్టు చేయడాన్ని చింతమనేని […]

బ్రేకింగ్: 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని అరెస్టు..

Edited By:

Updated on: Sep 11, 2019 | 12:29 PM

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుల కారణంగా 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని.. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. చింతమనేనిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసుల్లో చింతమనేని నిందితుడిగా ఉన్నారు. అయితే తనను అరెస్టు చేయడాన్ని చింతమనేని ఖండించారు. 12 రోజులుగా తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. కుట్రపూరితంగా తనపై కేసులు నమోదు చేసి.. కావాలనే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.