
ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర తంటాలు పడేవారు. ఇక అలాంటివారి కోసమే ఈపీఎఫ్‌ఓ సరికొత్త సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
నమోదు చేసే ప్రక్రియ ఇలా ఉంది..
కాగా, ఈ ప్రక్రియను మొదలుపెట్టే ముందు మీరు గతంలో పని చేసిన కంపెనీ సదరు వివరాలను నమోదు చేసిందో లేదో ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఉద్యోగులు తమ క్లోజింగ్ డేట్‌ను పై విధంగా నమోదు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తప్పుకుని రెండు నెలలు పూర్తవ్వాలి. పాత కంపెనీ చివరిసారిగా జమ చేసిన పీఎఫ్ మొత్తం రెండు నెలలు దాటినట్లయితేనే ఈ మార్పులకు వీలుంటుంది.
Now Employee’s can also update their Date of exit.#EPFO pic.twitter.com/IIZYC0Onja
— EPFO (@socialepfo) January 21, 2020