ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని నియామకాలపై వీసీ యోగేష్ త్యాగి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రో-వీసీగా పీసీ జోషీని తొలగించి ఆయన స్థానే ‘నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గీతా భట్ ను నియమించడం, ప్రస్తుత రిజిస్ట్రార్ స్థానే తాత్కాలిక రిజిస్ట్రార్ గా ను,సౌత్ క్యాంపస్ డైరెక్టర్ గా ను పీసీ ఝాను అపాయింట్ చేయడం వంటివి వివాదం రేపాయి. ఈ నియామకాలపై విద్యా మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..త్యాగి విధి నిర్వహణపట్ల నిర్లక్ష్యం చూపారని, ఆయనపై విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరింది. విచారణకు రాష్ట్రపతి అనుమతినిస్తూ, త్యాగిని సస్పెండ్ చేశారు. దీనిపై విద్యామంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. ఎమర్జెన్సీ మెడికల్ కండిషన్ పై త్యాగి గత జులై 2 నుంచి లీవు తీసుకుని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆయన తిరిగి వచ్ఛేవరకు ప్రొఫెసర్ జోషీని జులై 17 న వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక త్యాగి తీసుకున్న నిర్ణయాలు, చర్యలు కాంట్రోవర్షియల్ అయ్యాయి.