తూర్పుగోదావరిజిల్లా రాజానగరంలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపుతోంది. తోకాడాలోని ఇంటి నుంచి కళాశాలకు బయల్దేరిన యువతిని మార్గమధ్యలో దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం యువతి తండ్రికి ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకురాకపోతే మీ కుమార్తెను చంపేస్తామని దుండగులు ఫోన్‌లో బెదిరించారు. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. యువతిని …ఓ యువకుడు బైక్ వెనుక కూర్చొని తీసుకెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీని ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా యువతి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు కాకినాడ వెళ్లారు. ఐతే ఇది ప్రేమవ్యవహారమని పోలీసులు భావిస్తున్నారు. యువతి తన ఇష్టంతోనే యువకుడితో కలిసి వెళ్లిందా..? లేక ఇద్దరు కలిసే కిడ్నాప్ డ్రామా ఆడుతున్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read:
Hyderabad: గ్యాస్ సిలిండర్లను అపహరించుకెళ్లిన దొంగలు.. CCTV కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు..
Shilpa Chowdary Case: చీటింగ్ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. ఇంతలో మరో ట్విస్ట్..