హైదరాబాద్‌లోని మేడ్చల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ థర్డ్ ఇయర్ విద్యార్ధి జీవన్ రెడ్డి కనిపించకుండాపోయాడు. గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ లో ఉంటున్న జీవన్ గదిలో బట్టలపై రక్తపు మరకలతో పాటు బ్లేళ్లు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డ 11వ తేదీ రాత్రి నుంచి కనపడడంలేదని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ నుంచి వెళ్లేముందు రూమ్ మేట్స్ తో గొడవ పెట్టుకున్నాడని దర్యాప్తులో తేలింది.