కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి భారీ ఆపరేషన్ జరిగింది.
షోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. బందిపురలోని హాజిన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీ హింసకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. జైషే మహ్మద్, లష్కర్ ఉగ్రవాదుల భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. బారాముల్లా ప్రాంతంలో కూడా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.