ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !

ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.6 గా అమ్ముతున్నారు.

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !

Edited By:

Updated on: Sep 21, 2020 | 4:28 PM

ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.6 గా అమ్ముతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో రూ.5.07, చిత్తూరులో రూ.5.05, విజయవాడలో రూ.5.04,  తూర్పు గోదావరిలో రూ.5.04 చొప్పున ధరలు ఉన్నాయి. బయట కిరాణా షాపుల్లో ధర రూ.6 వరకు కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది.  రూ.6 అయినా సరే భారీగానే గుడ్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో సైతం గుడ్డు రోజూ మెనూలో భాగం అయిపోయింది.  కోడిగుడ్ల రేట్లు పెరగడానికి మెయిన్ రీజన్ ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవడం. ఇక ప్రస్తుత కోవిడ్ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోడానికి జనాలు కూడా గుడ్డును బాగా తింటున్నారు.

ఇక కరోనా ప్రభావం మన దేశంలో ప్రారంభమైన సమయంలో చికెన్, గుడ్లు రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో చాలా చోట్ల పౌల్ట్రీ నిర్వాహకులు వ్యాపారం నుంచి పక్కకు తప్పుకున్నారు. లాక్‌డౌన్‌ కష్టాల వల్ల మూడు నెలలు పాటు దాణా రవాణా నిలిచిపోవడంతో లక్షల్లో కోళ్లు చనిపోయాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి ఊహించనంతగా పడిపోయింది. ప్రస్తుతం  లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంటు, బేకరీలు రీ-ఓపెన్ అయ్యాయి. దీంతో గుడ్ల డిమాండ్ పెరిగింది. ఇలా చాలా అంశాలు .. కోడిగుడ్డు ధర పెరగడానికి కారణమయ్యాయి.

Also Read : టీచర్ ఆవేదన.. లైవ్‌లో ఏడ్చేసిన మధుమిత