కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసులు

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2019 | 3:04 PM

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తాను వాళ్ల కోసం పని చేయబోనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదనపు ఎన్నికల ప్రధాన కార్యదర్శి బీఆర్ తివారీ మాట్లాడుతూ… ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. సుల్తాన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి […]

కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసులు
Follow us on

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తాను వాళ్ల కోసం పని చేయబోనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదనపు ఎన్నికల ప్రధాన కార్యదర్శి బీఆర్ తివారీ మాట్లాడుతూ… ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. సుల్తాన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి నివేదిక అందింది… అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సంఘం నోటీసులపై స్పందించిన మేనకా గాంధీ.. బీజేపీ మైనారిటీ సెల్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.

‘‘మా పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో నేను మాట్లాడాను. నా పూర్తి ప్రసంగాన్ని చూడకుండా… ఓ మాటను పట్టుకుని, అసంపూర్తిగా పదే పదే ప్రసారం చేశారు.. అని ఆమె పేర్కొన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. నేను గెలవబోతున్నాను. ప్రజల సహకారం ప్రేమాభిమానాలతోనే నేను గెలవబోతున్నాను. అయితే ముస్లింల మద్దతు లేకుండా గెలిస్తే నాకు సంతోషం ఉండదు. రేపటి రోజున నా అవసరం మీకు వస్తుంది. నేను గెలిచిన తర్వాత.. మీ ప్రాంతంలో ఏదైనా పని నిమిత్తం నా వద్దకు వచ్చినప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి? అనే ఆలోచన వస్తుంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.