నిజామాబాద్ కౌంటింగ్ జాతర.. 31 గంటలు..!

| Edited By:

May 21, 2019 | 11:40 AM

ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల బయట వెబ్ కెమెరాలతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. మరోవైపు దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్‌డైన్ మొదలైంది. స్థానికంగా ఉన్న శివానీ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల లెక్కింపు మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు […]

నిజామాబాద్ కౌంటింగ్ జాతర.. 31 గంటలు..!
Follow us on

ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల బయట వెబ్ కెమెరాలతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. మరోవైపు దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్‌డైన్ మొదలైంది. స్థానికంగా ఉన్న శివానీ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల లెక్కింపు మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సుమారు 31 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 36 టేబుళ్ల ద్వారా లెక్కింపుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.