AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీకి ఆదేశాలు..! హైకోర్టులో పిటిషన్..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు 5 వీవీప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని పిటిషనర్ కోరారు. ఇందులో ఏదైనా తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌లు లెక్కించేలా ఈసీని ఆదేశించాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలోనే వాదనలు జరగనున్నాయి. ఈవీఎంల చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 5 వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు.. ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈవీఎంల లెక్కింపు […]

వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీకి ఆదేశాలు..! హైకోర్టులో పిటిషన్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 21, 2019 | 11:11 AM

Share

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు 5 వీవీప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని పిటిషనర్ కోరారు. ఇందులో ఏదైనా తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌లు లెక్కించేలా ఈసీని ఆదేశించాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలోనే వాదనలు జరగనున్నాయి.

ఈవీఎంల చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 5 వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు.. ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈవీఎంల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయో తెలిసిపోతుందని.. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం వల్ల ఉపయోగం లేదని పిటిషన్‌లో తెలిపారు. చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనను ఉల్లంఘించడమేనన్నారు.

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈసీ ఇప్పటివరకు తగిన ఉత్తర్వులు జారీ చేయలేదని పిటిషనర్ తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈవీఎంల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోర్టును కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కేబినెట్ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

Follow Us
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..