Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

భారతీయలు ఉల్లిపాయలు(onions) ఎక్కువగా వాడాతారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లిగడ్డ విరివిగా ఉపయోగిస్తారు...

Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Onion

Updated on: May 01, 2022 | 6:00 AM

భారతీయలు ఉల్లిపాయలు(onions) ఎక్కువగా వాడాతారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లిగడ్డ విరివిగా ఉపయోగిస్తారు. దాదాపు చాలా మంది ఇల్లిపాయలను 5 కిలోలు అంతకంటే ఎక్కువ ఒకేసారి తీసుకుంటారు. వాటిని ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు. ఈ ఉల్లిగడ్డలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొలకలు వస్తుంటాయి. చాలా మంది మొలకెత్తిన ఉల్లిగడ్డ(sprouted onions) తినరు. కానీ మొలకెత్తిన ఉల్లిపాయలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషదంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి(Heat) తగ్గుతుంది. అంతేకాకుండా ఎండకాలంలో ఉల్లిగడ్డలు తక్కువ ధరకు దొరుకుతాయి. ఉల్లిపాయలను బిర్యానీలో ఎక్కువగా వాడతారు. బిర్యానీలోనే కాదు ప్రతి వంటలో ఉల్లిగడ్డ ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొలకలు వస్తుంటాయి. దీంతో చాలా మంది ఇవి ఇక పనికిరావంటూ వాటిని పడేస్తుంటారు. మొలకెత్తిన ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మొలకలు వచ్చిన ఉల్లిపాయలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. మిటమిన్‌ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొలకెత్తిన ఉల్లిగడ్డలు పారేయకుండా తింటే చాలా మంచిది. మొలకెత్తిన ఉల్లిపాయల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యస్థ పనితీరును మెరుగుపర్చడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉల్లిగడ్డలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. సాధ్యమైనంత వరకు ఎండకాలంలో ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. tv9తెలుగు వీటిని నిర్ధారించలేదు.

Read Also.. Summer Health Tips: వేసవిలో ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. డైట్‌లో ఇది తప్పక చేర్చండి..