పరగడుపున చెంచా నెయ్యి తిన్నారంటే శరీరంలో జరిగేది మ్యాజిక్కే.. ఆరోగ్య లాభాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
మన భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. రుచిని, సువాసనను పెంచే నెయ్యి ఆరోగ్యానికి హానికరమని, బరువు పెంచుతుందని చాలామంది దీనిని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ, నెయ్యిని సరైన మోతాదులో తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఉదయం పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం:

రోజూ ఉదయం పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక ప్రాచీన సంపద. ఇది లేకుండా మనం వంటను ఊహించలేము. దాని ఘాటైన, సువాసనగల రుచిని ఎంతో మంది ఇష్టపడతారు. ఇది ఏ వంటకం రుచినైనా తక్షణమే పెంచే శక్తిని కలిగి ఉంది. అయితే, నెయ్యి అనారోగ్యకరమైనది అనే భావన చాలా మందిలో ఉంటుంది. బరువు పెరగడంతో సహా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావించి దీనిని పూర్తిగా మానుకుంటారు. అయితే, వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధం. ఇటీవల, పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. దీనిని మితంగా తీసుకుంటే, మీ మొత్తం ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
తరచూ గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అజీర్తి సమస్యలతో బాధపడేవారికి ఉదయాన్నే నెయ్యి తీసుకోవడం మంచి అలవాటు. ఇది కడుపులో యాసిడ్ల విడుదలను ప్రేరేపించి, జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.
శరీరాన్ని శుభ్రపరుస్తుంది (Detoxification):
ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి శరీరంలోని జఠరాగ్నిని (జీర్ణక్రియ మంటను) పెంచుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలను (టాక్సిన్స్) బయటకు పంపుతుంది. నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్ పెద్దప్రేగు కణాలకు అవసరమైన శక్తిని అందిస్తూ, సహజంగా శరీరాన్ని క్లీన్ చేస్తుంది.
ప్రేగుల ఆరోగ్యానికి రక్షణ (Gut Health):
ప్రేగుల ఆరోగ్యం బాగుంటేనే మనం తిన్న ఆహారం ఒంటబడుతుంది. రోజూ పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల ప్రేగుల లోపలి పొర (gut lining) బలపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, సుఖ విరేచనానికి సహాయపడుతుంది.
కడుపులో మంటను తగ్గిస్తుంది (Anti-Inflammatory Properties):
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణవ్యవస్థలో మంట లేదా ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఐబీఎస్ (Irritable Bowel Syndrome) వంటి దీర్ఘకాలిక ప్రేగు సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
View this post on Instagram
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
నెయ్యి తింటే లావు అవుతారనేది ఒక అపోహ మాత్రమే. నెయ్యిలో ఉండే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని మెటబాలిజం (జీవక్రియ) రేటును పెంచుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి పరోక్షంగా సహాయపడుతుంది. అయితే నెయ్యిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తక్కువ పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం. ఉదయాన్నే ఈ అలవాటును మొదలుపెట్టేటప్పుడు మొదట చిన్న స్పూన్ నెయ్యితో ప్రారంభించి, మీ శరీర తత్వానికి నచ్చితేనే క్రమంగా పరిమాణాన్ని పెంచండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.




