లద్దాఖ్‌, కార్గిల్‌లో భూకంపం.. వారంలో రెండోసారి..

| Edited By:

Jul 05, 2020 | 10:14 AM

లద్దాఖ్, కార్గిల్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లద్దాఖ్, కార్గిల్‌లో భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని..

లద్దాఖ్‌, కార్గిల్‌లో భూకంపం.. వారంలో రెండోసారి..
Earthquake
Follow us on

లద్దాఖ్, కార్గిల్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లద్దాఖ్, కార్గిల్‌లో భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 4.7గా నమోదైంది. కార్గిల్‌కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో భూమి కంపించిందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. గురువారం కూడా కార్గిల్‌లో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా లద్దాఖ్‌లో భారత్-చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భూమి కంపించింది. పంజీన్‌‌కు ఉత్తరాన 683 కిలో మీటర్ల దూరంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత మాగ్నిట్యూట్‌పై 4.4గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 252 కిలోమీటర్ల లోతున ఉందని అధికారులు తెలిపారు.