శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు […]

శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం

Updated on: Oct 27, 2020 | 5:35 PM

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయారని చెప్పారు.. దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వారికి ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా 1,51,124 టికెట్లు అందజేశామన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి నాలుగు కోట్ల 36 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను పాటించే ఉత్సవాలను నిర్వహించామన్నారు.. భక్తులు కూడా చక్కగా సహకరించారని చెప్పారు.