Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ

నగరంలోని మందుబాబుల తిక్క కుదర్చబోతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను శుక్రవారం నుంచి పున:ప్రారంభించనున్నారు.

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ
Follow us

|

Updated on: Dec 25, 2020 | 8:08 AM

Drunk And Drive Tests :  నగరంలోని మందుబాబుల తిక్క కుదర్చబోతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను శుక్రవారం నుంచి పున:ప్రారంభించనున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో..వారం రోజుల ముందు నుంచే ఈ ప్రత్యేక తనిఖీలు షురూ చేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ నిర్ధారించారు. నేటి నుంచి ప్రతిరోజు నగరంలో డ్రంక్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని చెప్పారు. ఇక రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫేస్‌ షీల్డ్‌లు ధరించి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నారు. బ్రీత్‌ అనలైజర్‌కు ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేసి, భౌతిక దూరం పాటిస్తూ ఈ టెస్టులు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగి నడిపుతూ పట్టుబడితే బండిని సీజ్ చేయడంతో పాటు‌ భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శృతి మించితే జైలు శిక్షలు కూడా పడతాయని చెబుతున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

Latest Articles
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..