డ్రోన్ల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

| Edited By:

Mar 12, 2019 | 4:10 PM

అహ్మదాబాద్‌: డ్రోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు గుజరాత్ డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. కెమెరా స్టాండ్‌లు, గృహోపకరణాల ముసుగులో 4-5 నెలలుగా డ్రోన్ల రవాణా సాగుతున్నట్లు వారు గుర్తించారు. చైనా నుంచి మనదేశంలోకి అక్రమంగా తీసుకొచ్చిన 85 అత్యాధునిక డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి మయన్మార్‌ సరిహద్దుల గుండా తొలుత వాటిని తీసుకొస్తున్నారని, ఆపై అహ్మదాబాద్‌ తదితర […]

డ్రోన్ల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
Follow us on

అహ్మదాబాద్‌: డ్రోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు గుజరాత్ డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. కెమెరా స్టాండ్‌లు, గృహోపకరణాల ముసుగులో 4-5 నెలలుగా డ్రోన్ల రవాణా సాగుతున్నట్లు వారు గుర్తించారు. చైనా నుంచి మనదేశంలోకి అక్రమంగా తీసుకొచ్చిన 85 అత్యాధునిక డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి మయన్మార్‌ సరిహద్దుల గుండా తొలుత వాటిని తీసుకొస్తున్నారని, ఆపై అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని వెల్లడించారు.