ఇకపై ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే ‘0’ తప్పనిసరిగా చేర్చాల్సిందే.!

|

Nov 25, 2020 | 2:56 PM

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా(ట్రాయ్) చేసిన కొత్త ప్రతిపాదనకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి..

ఇకపై ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే 0 తప్పనిసరిగా చేర్చాల్సిందే.!
Follow us on

DoT Accepts Proposal: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా(ట్రాయ్) చేసిన కొత్త ప్రతిపాదనకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా ‘0’ చేర్చాలని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని.. దానికి అనుగుణంగా టెలికాం సంస్థలు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని డాట్ సూచించింది.

అంతేకాకుండా ‘0’ చేర్చే విధంగా ల్యాండ్‌లైన్ డయిలింగ్ ప్యాటరన్‌లో మార్పులు చేయాలంది. ఈ కొత్త రూల్ గురించి చందాదారులకు ప్రకటనల ద్వారా తెలియజేయాలంది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి ఎవరైతే చందాదారులు సున్నాను చేర్చకుండా నెంబర్‌ను డయిల్ చేస్తారో.. వారికి ప్రతీసారి ఈ ప్రకటన వినిపించాలని డాట్ పేర్కొంది. చందాదారులందరికీ కూడా సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను డాట్ జారీ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.

ఇది చదవండి: వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక ఫోన్‌లో సిమ్ లేకుండానే మాట్లాడొచ్చు.!