వాటి వెంటపడ్డారో మటాషే.. యువతకు హరీశ్ హెచ్చరిక

| Edited By: Srinu

Dec 07, 2019 | 6:28 PM

తెలంగాణ మంత్రి హరీశ్ రావు యువతకు ఘాటు హెచ్చరిక చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంత సాగర్ గ్రామంలో 30 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ కల అంటూ హితబోధ ప్రారంభించారు. ప్రతీ పేదోడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ముందు చెట్లను పెంచాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. […]

వాటి వెంటపడ్డారో మటాషే.. యువతకు హరీశ్ హెచ్చరిక
Follow us on

తెలంగాణ మంత్రి హరీశ్ రావు యువతకు ఘాటు హెచ్చరిక చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంత సాగర్ గ్రామంలో 30 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ కల అంటూ హితబోధ ప్రారంభించారు. ప్రతీ పేదోడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని హరీశ్ రావు అన్నారు.

ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ముందు చెట్లను పెంచాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుకోవాలని లేదా ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంలో ఆయన యువతకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మొబైల్ ఫోన్ ,పేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల వెంట పడొద్దని హరీశ్ చెప్పారు. వాటి మాయలో పడితే భవిష్యత్తు మటాష్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు హరీశ్ రావు. సోషల్ మీడియాలో సమయం వృధా చేసుకోవద్దన్నారాయన.

తెలంగాణ రాష్టంలో పేద విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వాటిలో ప్రతీ ఒక్కరు చక్కగా చదువు కోవాలని హరీశ్ సూచించారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా మెదులుకుంటే సమస్యలే రావని చెప్పుకొచ్చారు హరీశ్ రావు.