AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా శునకమా ? మజాకా ?

ఆ మధ్య ఐసిస్ ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ ని సిరియాలో సొరంగంలోకి వెంటాడి.. అతడ్ని మట్టుబెట్టడానికి అమెరికా పోలీసులకు సహకరించిన శునకం గుర్తుందా ? సైనిక శిక్షణ పొందిన దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించి మెడల్ కూడా బహుకరించారు. దాని సాహసాన్ని మెచ్చుకుంటూ ఫొటోతో కూడిన ట్వీట్ చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో శునకం ‘ కథ ‘ కూడా తెలిసింది. దీనిపేరు ‘ డ్యూక్ ‘. వయస్సు 7 సంవత్సరాలు. బెల్జియన్ మాలినోయిస్ […]

అమెరికా శునకమా ? మజాకా ?
Anil kumar poka
|

Updated on: Dec 21, 2019 | 5:13 PM

Share

ఆ మధ్య ఐసిస్ ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ ని సిరియాలో సొరంగంలోకి వెంటాడి.. అతడ్ని మట్టుబెట్టడానికి అమెరికా పోలీసులకు సహకరించిన శునకం గుర్తుందా ? సైనిక శిక్షణ పొందిన దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించి మెడల్ కూడా బహుకరించారు. దాని సాహసాన్ని మెచ్చుకుంటూ ఫొటోతో కూడిన ట్వీట్ చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో శునకం ‘ కథ ‘ కూడా తెలిసింది. దీనిపేరు ‘ డ్యూక్ ‘. వయస్సు 7 సంవత్సరాలు. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఈ జాగిలం.. క్రిమినల్స్ ని పట్టుకోవడంలో పోలీసులకు తన ‘ సహకారం ‘ ఎంతగానో అందిస్తోంది. తన భార్యను హతమార్చుతానంటూ బెదిరిస్తున్న వాస్ క్వెజ్ అనే నేరగాణ్ణి పోలీసులు పట్టుకోవడంలో డ్యూక్ సాహసోపేతమైన పనే చేసింది. పోలీసుల కళ్ళు గప్పి వాస్ క్వెజ్ పారిపోతుండగా అతడ్ని వారు వెంటాడారు.

తమతో బాటు ఈ కుక్కను కూడా వారు తీసుకువెళ్లారు. నిందితుడు ప్రయాణిస్తున్న ట్రక్కును ఆపేందుకు పోలీసులు ఆ వాహనంపైకి రబ్బర్ బులెట్లను ప్రయోగించారు. ఈ కాల్పుల్లో అతని వాహనం విండో స్క్రీన్ దెబ్బతినగా ఒకచోట వాహనాన్ని ఆపేశాడు. విండో స్క్రీన్ పగిలిపోయి.. రంధ్రం ఏర్పడగా మన ‘ గురుడి ‘ ముఖం ఎంచక్కా బయటపడింది.

అంతే.. పోలీసు వాహనంలో ఉన్న ‘ డ్యూక్ ‘ ఒక్కసారిగా దూసుకుపోయి.. బద్దలైన ఆ విండో నుంచే అతనిమీద పడింది. వాస్ క్వెజ్ తప్పించుకోవడానికి వీల్లేకపోగా.. డ్యూక్ అతడ్ని వదలలేదు. ఈ శునకం పుణ్యమా అని.. ఈ నిందితుడు సులభంగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతడ్ని అరెస్టు చేసి వాళ్ళు కటకటాల వెనక్కి నెట్టారు. డ్యూక్ సాహసం చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Follow Us
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి