
Director Bharathiraja : సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని దర్శకుడు భారతీరాజా అన్నారు. రజినీ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదని సూచించారు. సినిమా నటులకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదు, కానీ రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండ కావాలి అంటూ పేర్కొన్నారు.
అందుకే నేను రజినీకాంత్‌తో విభేదించాను అని స్పష్టం చేశారు. తమిళనాడులో తమిళులే సీఎంగా ఉండాలన్నా ఆయన.. రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం అతని ఆరోగ్య రీత్యా మంచిదని సూచించారు. అయినా అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రజినీ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరు సంపాదించలేరని భారతీ రాజా పేర్కొన్నారు.
అయితే.. కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించబోతున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తనను క్షమించాలంటూ మూడు పేజీల లేఖ కూడా రజినీకాంత్ విడుదల చేసారు.