రికార్డు బద్దలు కొడుతున్న ‘దిల్‌ బేచారా’

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ అందరి హృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం హృదయాలనే కాదు పలు రికార్డులనూ సైతం సొంతం చేసుకుంటుంది. ముఖేశ్‌ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్‌ బేచారా’ చిత్రంలో సుశాంత్‌ సింగ్, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

రికార్డు బద్దలు కొడుతున్న ‘దిల్‌ బేచారా’

Updated on: Jul 31, 2020 | 5:41 AM

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ అందరి హృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం హృదయాలనే కాదు పలు రికార్డులనూ సైతం సొంతం చేసుకుంటుంది. ముఖేశ్‌ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్‌ బేచారా’ చిత్రంలో సుశాంత్‌ సింగ్, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. పోయిన వారం ఈ చిత్రం హాట్‌స్టార్‌ లో కూడా రిలీజ్‌ అయింది. తొలి రోజే సుమారు 95 మిలియన్‌ వ్యూస్‌ సాధించిందట ‘దిల్‌ బేచారా’. అంటే.. సుమారు తొమ్మిదిన్నర కోట్లు అర్జించిందని చిత్ర యూనిట్ తెలిపింది.

‘దిల్‌ బేచారే’ని తొలిరోజే తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించడం రికార్డే. సుశాంత్‌ చివరి చిత్రం కావడం తో తప్పక చూడాలని ప్రేక్షకులు అతనికి ప్రేమగా ఇచ్చిన నివాళి ఇది అంటున్నారు సినీ విశ్లేషకులు. హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అలాగే, మొదటిరోజు ఎక్కువ మంది చూస్తూ ఉండటంతో హాట్‌స్టార్‌ క్రాష్‌ అయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇదే సినిమా థియేటర్లు ఓపెన్ అయితే ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచిచూద్దాం.