కరోనాకూ ఇన్సూరెన్స్.. వైరస్ ఉన్నా, లేకున్నా చెల్లింపులు..

|

Mar 04, 2020 | 4:59 PM

మహమ్మారి కరోనా చైనాలో స్టార్టయి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఇది శరవేగంగా విస్తరించడంతో, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భారత్‌లో ఈ వైరస్ సోకినవారి సంఖ్య తాజాగా 28కి చేరుకుంది. ప్రభుత్వాలు అలర్టయి..ప్రత్యేక ఆస్పత్రులు కేటాయించి మరీ వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ముందు జాగ్రత్తలు తీసుకునే చాలామంది..లైఫ్ ఇన్సూరెన్స్‌ కూడా చేయించుకుంటున్నారు. తాజాగా కరోనా కోసం ఓ ప్రత్యేక పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇన్సూర్‌టెక్ స్టారప్ డిజిట్ అనే ఇన్సూరెన్స్ అనే భారత కంపెనీ ఈ ఇన్సూరెన్ […]

కరోనాకూ ఇన్సూరెన్స్.. వైరస్ ఉన్నా, లేకున్నా చెల్లింపులు..
Follow us on

మహమ్మారి కరోనా చైనాలో స్టార్టయి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఇది శరవేగంగా విస్తరించడంతో, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భారత్‌లో ఈ వైరస్ సోకినవారి సంఖ్య తాజాగా 28కి చేరుకుంది. ప్రభుత్వాలు అలర్టయి..ప్రత్యేక ఆస్పత్రులు కేటాయించి మరీ వైద్యసేవలు అందిస్తున్నాయి.

అయితే ముందు జాగ్రత్తలు తీసుకునే చాలామంది..లైఫ్ ఇన్సూరెన్స్‌ కూడా చేయించుకుంటున్నారు. తాజాగా కరోనా కోసం ఓ ప్రత్యేక పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇన్సూర్‌టెక్ స్టారప్ డిజిట్ అనే ఇన్సూరెన్స్ అనే భారత కంపెనీ ఈ ఇన్సూరెన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రీమియం రూ.299 నుంచి స్టార్టవుతుంది. ఈ పాలసీలో నమోదు చేసుకున్నవాళ్లకు కరోనా నిర్దారణ అయితే 100 శాతం ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఊహించని విధంగా అనుమానిత వ్యాధిగ్రస్తులు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించింది సదరు కంపెనీ. అయితే ఫుల్ అమౌంట్ రాదు..సగం మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంది. కరోనా అనుమానితులను అబ్జర్వేషన్‌లో ఉంచుతోన్న నేపథ్యంలో వారు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే సగం మొత్తాన్ని చెల్లిస్తారు.  రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీని తీసుకోవచ్చు.

కరోనా విసృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో … వివిధ రకాల స్క్రీనింగ్ అండ్ ట్రీట్‌మెంట్… టెస్ట్‌ల కోసం ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొకుండా ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టు డిజిట్ ఇన్సూరెన్స్ చైర్మన్ కామేశ్ గోయల్ తెలిపారు.