AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putharekulu: ఆత్రేయపురం బంగారం పూతరేకులు.. ఒక్కోటి ఎంతో తెలిస్తే మీ దిమ్మతిరిగిపోద్ది

ఈ ఫోటోలో కనిపిస్తున్నవి బంగారం పూతరేకులు. అంటే పూర్తిగా గోల్డ్‌తో తయారు చేశారని అనుకోకండి. స్వీట్స్‌ తయారీలో వినియోగించే స్వర్ణ రేకులతో వీటిని చేశారు. ఎంచక్కా తినేయచ్చు. ఇంతకీ కాస్ట్ ఎంతో తెల్సా..?

Putharekulu: ఆత్రేయపురం బంగారం పూతరేకులు.. ఒక్కోటి ఎంతో తెలిస్తే మీ దిమ్మతిరిగిపోద్ది
Putharekulu
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2023 | 2:56 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని  ఆత్రేయపురం అనే పేరు వినగానే వెంటనే గుర్తెచ్చేది నోరూరించే పూతరేకులు. ఇక్కడి స్పెషల్ ట్రేడ్ మార్క్ స్వీటైన పూత రేకులు అంటే ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ లవర్స్ ఇష్టపడతారు. నోట్లో ఇట్టా పెట్టుకోగానే అట్టా కరిగిపోతాయి పూతరేకులు. రంగు, రుచి, సువాసన, శుభ్రత వల్ల వీటికి అంత క్రేజ్ వచ్చింది. తాజాగా అక్కడ బంగారు పూతరేకులు తయారు చేశారు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ పనికి పూనుకున్నారు. ఎడిబుల్ గోల్డ్ అనగా స్వీట్స్ తయారీలో వినియోగించే స్వర్ణ రేకులతో ఈ పూతరేకులు తయారుచేశారు. ఒక్కో బంగారు పూత రేకు ధర 800 రూపాయలు.

ఆత్రేయపురం చాదస్తం పూతరేకుల షాపులో 24 క్యారెట్స్ ఎడిబుల్ గోల్డ్‌తో తయారు చేసిన పూతరేకులను స్పెషల్‌గా విక్రయించారు. ఈ పూతరేకులను టేస్ట్ చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలుకు ప్రసిద్ధి.. కనుక తాము గోల్డెన్ పూత రేకులు తయారు చేసినట్లు షాపు యజమాని తెలిపారు. ఆత్రేయపురం పూతరేకులకు ఇటీవలే అంతర్జాతీయ భౌగోలిక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే.

ఏపీకి సంబందించి ఇప్పటి వరకు కేవలం 18 ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం ఉన్న వాటికే భౌగోళిక గుర్తింపు దక్కింది. వాటిలో తిరుపతి లడ్డూ, బందరు లడ్డూ,  కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ జిందానీ చీరలు వంటివి ఉన్నాయి. తాజాగా ఆత్రేయపురం పూతరేకు ఈ లిస్ట్‌లో చేరింది. మరో 4 నెలల్లో దీనికి సంబంధిచిన గెజిట్‌ రానున్నట్లు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఇటీవల తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు