ఈ పండ్లు డయాబెటిక్ పేషెంట్లకు విషంతో సమానం, పొరపాటున కూడా వీటిని తినే ఆహారంలో చేర్చుకోవద్దు

|

Jul 18, 2024 | 11:30 AM

మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. షుగర్ సమస్యలతో బాధపడేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇది నయం కాని వ్యాధి. దీనికి మందు లేదు. అయతే జీవనశైలిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ ను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. అదే సమయంలో ఈ వ్యాధి బారిన ఒకసారి పడితే ఈ వ్యాధి జీవితాంతం ఆ వ్యక్తితో ఉంటుంది. అయితే దీన్ని నియంత్రించేందుకు మార్కెట్‌లో కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను సకాలంలో తీసుకోవడంతో పాటు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆహారం తినే విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా డయాబెటిక్ రోగులకు ప్రమాదకరంగా మారుతుంది.

1 / 5
ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది సీజనల్ ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకుంటారు. అయితే డయాబెటిక్ రోగులకు కొన్ని రకాల పండ్లు విషంలా పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో షుగర్ పేషెంట్స్ ఏ పండ్లను తినకూడదో తెలుసుకోవాలి. ఈ రోజు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాం.

2 / 5
ద్రాక్ష పండ్లు: ద్రాక్ష పండ్లు తీపి , పుల్లని రుచి కలగలిపి ఉంటాయి. కనుక వీటిని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎవరైనా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి చిన్నగా ఉంటాయి కనుక ఎక్కువ మంది వీటిల్లో షుగర్ ఉంటుందని అనుకోరు. అంతేకాదు ద్రాక్ష పండ్లను అధికంగా తింటారు. ఇలా చేయడం వలన డయాబెటిక్ రోగులకు హానికరం.

3 / 5
అనాస పండు: విటమిన్లు, బ్రోమెలైన్ కాకుండా, పైనాపిల్ చక్కెరలో కూడా పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా డయాబెటిక్ రోగులు అనాస పండుకు దూరంగా ఉండాలి. దీనిలోని మీడియం గ్లైసెమిక్ సూచికతో అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెంచుతుంది. ఈ కారణంగా డయాబెటిక్ రోగులు దీనికి దూరంగా ఉండాలి.

4 / 5
అరటి పండు: ఇది చాలా పోషకమైన పండు. తక్కువ ధరలో ప్రతి సీజన్ లో దొరికే అరటి పండుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ పోషకమైన పండు మధుమేహ రోగులకు హాని కలిగిస్తుంది. అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు.

5 / 5
మామిడి పండ్లు : పండ్లలో రారాజు మామిడి పండు. దాదాపు అందరికీ ఇష్టమైన పండు. అయితే ఈ పండ్లు మధుమేహ రోగులకు హానికరం. మామిడి పండులో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.