నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చిన డీజీపీ.. అశ్లీల దృశ్యాల చూస్తే.. అంతే!

| Edited By: Srinu

Dec 04, 2019 | 5:32 PM

అశ్లీల దృశ్యాల డౌన్‌లోడింగ్‌లో తమిళనాడు మొదటిలో ఉన్నట్లు అమెరికాలోని ఓ సంస్థ చెందిన సర్వేలో తేలిందని.. నిరోధక శాఖకు సంబంధించిన అదనపు డీజీపీ రవి తెలిపారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. ఇందుకు హైదరాబాద్‌లోని దిశ ఘటనే నిదర్శనంగా తీసుకోవచ్చన్నారు. దిశ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని.. ఇలాంటి దాడులకు పాల్పడ్డ మృగాళ్లపై కఠిన శిక్షలు అమలు పరచాలని.. దేశవ్యాప్తంగా తీవ్రమైన డిమాండ్ వినిపిస్తోందన్నారు. పార్లమెంటులో సైతం ఈ ఘటనపై విస్తృత […]

నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చిన డీజీపీ.. అశ్లీల దృశ్యాల చూస్తే.. అంతే!
Follow us on

అశ్లీల దృశ్యాల డౌన్‌లోడింగ్‌లో తమిళనాడు మొదటిలో ఉన్నట్లు అమెరికాలోని ఓ సంస్థ చెందిన సర్వేలో తేలిందని.. నిరోధక శాఖకు సంబంధించిన అదనపు డీజీపీ రవి తెలిపారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. ఇందుకు హైదరాబాద్‌లోని దిశ ఘటనే నిదర్శనంగా తీసుకోవచ్చన్నారు. దిశ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని.. ఇలాంటి దాడులకు పాల్పడ్డ మృగాళ్లపై కఠిన శిక్షలు అమలు పరచాలని.. దేశవ్యాప్తంగా తీవ్రమైన డిమాండ్ వినిపిస్తోందన్నారు. పార్లమెంటులో సైతం ఈ ఘటనపై విస్తృత చర్చ నడుస్తోందని.. అయినా.. మరోపక్క దుర్మార్గుల ఆగడాలకు మాత్రం అడ్డులేకుండా పోతోందన్నారు.

దీంతో.. ప్రభుత్వాలు.. ఇలాంటి ఘటనలపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోనుంది. ముఖ్యంగా సోషల్ మీడియాపై.. పటిష్ఠమైన సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలని డీజీపీ రవి తెలిపారు. ఎవరైనా.. అసభ్యకరమైన పోస్టులు పెట్టినచో.. వారికి జైలు శిక్ష తప్పదని హుకుం జారీ చేశారు. ఇక నుంచి నెటిజెన్లు అసభ్య చిత్రాలను చూసినా.. డౌన్‌లోడ్ చేసినా.. ఫోన్‌లో నిక్షిప్తం చేసినా.. అరెస్ట్‌లు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనిని గనుక తప్పకుండా.. ఆచరిస్తే.. చాలా వరకూ క్రైమ్ రేటు తగ్గే ఛాన్స్ ఉంటుందని.. డీజీపీ అభిప్రాయపడుతున్నారు.